Sunday, September 6, 2009

ఔను ఎంత కష్టం.......

నీ కోసం వేల వేల క్షణాలని వృథాగా పారబోసుకున్నాను. ఆనందాన్ని,బాధలని,కోపాలని,తాపాలని నీతో కలసి పంచుకున్నాను. "నేను" లో 'నే'నేనైతే'ను ' నువ్వు.విందులు,వినోదాలు,చిలిపి ఆటలు, వలపు పాటలు విటన్నిటిని చూసి ప్రేమెంత సరళమైందో అనుకునేవాణ్ణి. మరి ఇదేంటి? ఈ రోజు దూరమైన నువ్వు కనబడితె మనసు బంధిస్తున్న ఆగని కనుచూపు, నీ ముంగురుల చాటున దాగిన జుంకాని చుడాలన్న ఉబలాటం ఔరా ...! ప్రేమున్నా లేనట్టు కనబడటం ఎంత కష్టం.